CEO Vikas Raj : ప్రశాంత వాతావరణంలో తెలంగాణ ఎన్నికలు: సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణలో 70.74శాతం పోలింగ్ నమోదు వివరాలను ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు.

CEO Vikas Raj

CEO Vikas Raj : తెలంగాణలో 70.74శాతం పోలింగ్ నమోదు అయ్యిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని తెలిపారు. శుక్రవారం (డిసెంబర్ 1,2023) ఆయన మీడియాతో మాట్లాడుతూ .. రాష్ట్రంలో పోలింగ్ శాతంపై వివరాలు వెల్లడించారు. లక్షా 80వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని అలాగే హైదరాబాద్ లో అత్యంత తక్కువగా 46.68 శాతంగా పోలింగ్ నమోదు అయ్యిందని తెలిపారు. ప్రతీ నియోజక వర్గానికి తిరిగి పరిస్థితిని పోలింగ్ శాతం వంటి విషయాలను తెలుసుకోవటానికి ఇబ్బంది ఉంటుందని అందుకే అందరిని హైదరాబాద్ కు పిలిపించి వివరాలు తెలుసుకున్నామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల 26లక్షల ఓట్లు ఉన్నాయని..వీటిలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. పోలింగ్ ప్రారంభమయ్యాక పలు ప్రాంతాల్లో ఈవీఎంల సమస్యలు ఏర్పడ్డాయని దీంతో EVM ల మార్పిడి చేసామని తెలిపారు. దేవరకద్రలో 10మంది ఓటర్లే ఉన్నా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. EVM లను ఆయా పార్టీ ఎజెంట్ల మధ్యనే స్ట్రాంగ్ రూమ్ కి తరలించామని వెల్లడించారు. కౌంటింగ్ కు అన్ని చర్యలు తీసుకుంటున్నామని..కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని తెలిపారు.

స్ట్రాంగ్ రూముల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలతో భద్రత ఏర్పాటు చేశామని వెల్లడించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ పోలింగ్ శాతం నమోదైందని కొన్ని ప్రాంతాల్లో తక్కువగా అయ్యిందన్నారు. లెక్కింపు జరిగిన కూడా మళ్ళీ రెండు సార్లు EVM లు లెక్కిస్తారని తెలిపారు. ఈసీఐ నిబంధనల ప్రకారం కౌంటింగ్ జరుగుతుందన్నారు. అలాగే ప్రతీ రౌండ్ కు సమయం పడుతుందన్నారు.

ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని..8.30 నిమిషాల నుంచి EVM ల లెక్కింపు ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలు ఉంటాయని అదే హైదరాబాద్ లో 14 ఉన్నాయన్నారు. ప్రతి టేబుల్ వద్దా ఐదుగురు ఉంటారని పక్కా భద్రతతో కౌంటింగ్ కు సిద్ధమవుతున్నామని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు