వీటిపై చర్చ జరపాలని మేము డిమాండ్ చేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదు: చామల కిరణ్ కుమార్ రెడ్డి

బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేసిందని అన్నారు. 400 సీట్లు వచ్చి ఉంటే కొత్త రాజ్యాంగాన్ని తెచ్చేవారని తెలిపారు.

ఎన్డీఏ ప్రభుత్వం చర్చలు లేకుండా శీతాకాల సమావేశాలను ముగించిందని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ… ఆదానీ, శంభల్, మణిపూర్ సహా ప్రజా సమస్యలపై చర్చ జరపాలని తాము డిమాండ్ చేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.

అంబేద్కర్ పేరును ఉచ్చరించడమే తప్పు అన్నట్లుగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడి దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని చెప్పారు. ఎడిటింగ్ చేశారని తమ మీదే నిందలు వేసే ప్రయత్నం చేసి విఫలం అయి, నిన్న విపక్ష ఎంపీలపై దాడికి పాల్పడి.. ఆ దాడి ఘటనను రాహుల్ గాంధీ మీదకు నెట్టే కుట్ర చేశారని తెలిపారు.

బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేసిందని అన్నారు. 400 సీట్లు వచ్చి ఉంటే కొత్త రాజ్యాంగాన్ని తెచ్చేవారని తెలిపారు. వింటర్ సెషన్ మొత్తం విపక్షాలపై నెపాన్ని నెట్టేందుకు వాడారని, అసలు సభను నడిపించే ఆలోచన బీజేపీకి లేదని అన్నారు. 2/3 మెజారిటీ లేనిది జమిలి బిల్లు పాస్ కాదని తెలిసి కూడా చిత్తశుద్ధి లేకుండా తూతూ మంత్రంగా జమిలి బిల్లు పార్లమెంటు లో పెట్టి చేతులు దులుపుకొన్నారని తెలిపారు.

ఫార్ములా ఈ-కారు రేస్ కేసు.. దూకుడు పెంచిన ఏసీబీ.. రంగంలోకి ఈడీ