CM KCR Hot Comments On Chandrababu (Photo : Facebook, Google)
CM KCR Hot Comments On Chandrababu : తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఛాన్స్ చిక్కితే చాలు ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ నే గెలిపించాలని అంటున్నారు కేసీఆర్. ఈ ఎన్నికల్లో గెలుపుపై ఆయన చాలా ధీమాగా ఉన్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయం అంటున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ ఎన్ని సీట్లలో గెలుస్తుందో కూడా చెప్పేస్తున్నారు. నో డౌట్ మన గెలుపు పక్కా అన్న సీఎం కేసీఆర్.. 95 నుంచి 105 స్థానాలు మనవే అని జోస్యం చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గం స్థాయి బీఆర్ఎస్ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
24ఏళ్ల క్రితం ఒక్కణ్ణే బయల్దేరి వెళ్ళా..
”24 ఏళ్ల క్రితం ఒక్కణ్ణే బయల్దేరి వెళ్ళాను. ఆనాడు కొంతమంది మిత్రులం కూర్చుని మన బతుకు ఇంతేనా అని బాధ పడేవాళ్ళం. ఆనాడు నిస్పృహ, నిస్సహాయత ఉండేది. కానీ, ఏం చేయాలో తెల్వని పరిస్థితి. ఎక్కడ చూసినా చిమ్మ చీకటి. ఎవరిని కదిలించినా మన బతుకులు ఏం ఉన్నాయి? అనే ఆవేదన ఉండేది. నేను 10వ తరగతి చదువుతున్న సమయంలో మన జిల్లా కేంద్రం సంగారెడ్డి అక్కడకు పోవాలంటే 5,6 గంటల సమయం పట్టేది. మంజీర నది ఎండిపోయి 800 ఫీట్ల లోతుకు బోర్ వేసినా నీళ్లు రాకపోయేవి.
Also Read : కవితకు ఆ ఇద్దరి బాధ్యతలే ఎందుకు అప్పగించారు.. ఆ ఇద్దరు నేతలు ఎవరు?
చంద్రబాబు మోసం చేశారు..
అప్పుడు ట్రాన్స్ ఫార్మర్స్ కాలిపోతే ఒక్కో బాయికి 2, 3 వేలు వేసుకొని రిపేర్ చేయించే పరిస్థితి ఉండేది. 27మంది ఎమ్మెల్యేల సంతకాలు చేయించుకొని ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళాను. కానీ అప్పటి విద్యుత్ సంస్థల చైర్మన్ అన్నీ ఒప్పుకుంటా కానీ స్లాబ్ మాత్రం చేంజ్ చేయం అని చెప్పారు. గట్టిగా పట్టుపడితే స్లాబ్ చేంజ్ చేశారు. ఆనాడు కరెంటు బిల్లు పెంచము అని చెప్పి మోసం చేశారు చంద్రబాబు. ఇక లాభం లేదని, చూస్తూ ఊరుకునేది లేదని తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను.
కొంతమందితో కలిసి ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ముందుకు వచ్చా. నాతో ఎవరూ కలిసి రాలేదు. నేను వస్తే కూడా జారుకున్నారు. చివరికి తెలంగాణ సాధించుకున్నాం. గజ్వేల్ కు కావాల్సింది చాలా ఉంది. లీడర్లు ఇదే చాలు అని ఉరుకోవద్దు. ఇంకా కావాలని పట్టుపట్టాలి. ఊర్లలోకి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. ఊరిలో మోటర్ లేదు. సంపు లేదు. కానీ నీళ్లు వస్తున్నాయి. దీనికి ప్రేరణ ఏంటంటే సిద్దిపేట ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు సిద్దిపేటలో భయంకరమైన కరవు ఉండే. అప్పుడు ఆలోచన చేసి మిడ్ మానేరు నుండి ఎత్తైన గుట్టపైకి నీళ్లు సప్లై చేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చాము. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తున్నాం.
నాడు ఎక్కడ చూసినా బిందెలతో ప్రదర్శనలు..
ఆనాడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బిందెలతో ప్రదర్శనలు ఉండే. ఇప్పుడు ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చిన రోజు చెట్టుకు ఒక్కరు గుట్టకు ఒక్కరు అయ్యారు. మహబూబ్ నగర్ తో పాటు మన మెదక్ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉండేది. వ్యవసాయ స్థిరీకరణ జరగాలి. జరిగితే వలసలు ఆగుతాయి అని ఆలోచన చేశాం. ఇప్పుడు వలసలు వాపసు వచ్చి వ్యవసాయ రంగం పురోగమించింది. అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
నేను ఓడిపోలేదు, ఓడించబడ్డాను..
వీటన్నింటి నుండి బయటకు రావాలంటే ఎలా అని ఎంతో ఆలోచన చేశాము. ఎంతో మంది ఆర్ధిక, వ్యవసాయ రంగం నిపుణులతో మాట్లాడాము. అప్పుడే వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. నేను ఒక్కసారే ఓడిపోయాను. అప్పుడు కూడా నేను ఓడిపోలేదు. ఓడించపడ్డాను. అప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్లు లేకుండే . బ్యాలెట్ పేపర్ ఉండే. 6 ఓట్లతో ఓడించారు. గజ్వేల్ బిడ్డలు నన్ను కడుపులో పెట్టుకొని గెలిపించారు. ఒక్కసారి రెండుసార్లు గెలిపించారు. అయితే కొంత చేశాము గజ్వేల్ కు. ఇంకా చేయాలి.
కరోనాతో ఆర్థిక ఇబ్బందులు..
కరోనాతో కొంత ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయి. రాష్ట్రంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదించాయి. నాకు కూడా కరోనా వచ్చింది. కరోనా అట్లనట ఇట్లనాట అని భయంకర వార్తలు రాశారు మీడియా, పేపర్ వాళ్ళు. పదవులు వస్తాయి, పోతాయి. ఉన్నప్పుడు ఏం చేశారు అనేది ముఖ్యం. రైతాంగం పంటలు పండించాలి. ఎన్నికల తర్వాత ఒక్కరోజు మొత్తం గజ్వేల్ నియోజకవర్గం ప్రజలతో గడుపుతా.
Also Read : కేసీఆర్ రాకతో షబ్బీర్ అలీ వెనకడుగు.. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?
ఇండియాలో తగ్గిపోతే తెలంగాణలో పెరిగాయి..
భూములు పోయిన బాధ చాలా పెద్దది. నాకు కూడా బాధ ఉంది. నాది కూడా భూమి పోయింది. మా అత్తగారి ఊర్లో నా అత్తగారి భూమి, నా ఊర్లో భూమి కూడా పోయింది. మీరు ఇవాళ కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కింద భూములు కోల్పోయారు. మీకు ఇవాళ యావత్ రైతాంగం రుణపడి ఉంటుంది. ఇండియాలో భూగర్భ జలాలు తగ్గిపోతే తెలంగాణలో మాత్రం భూగర్భ జలాలు పెరిగాయి. ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ తోనే సాధ్యమైంది.
95 నుంచి 105 సీట్లు మనవే.. ఇకపై నెలకు ఒక్కపూట మీతోనే..
మొదటి దశలో ప్రాజెక్టు కట్టుకున్నాం. కాంగ్రెస్ వాళ్లు, కోదండరాం లాంటి వాళ్ళు అడ్డుకున్నారు. రెండో దశలో మరింత అభివృద్ధి చేసుకోవాలి. రెండో దశలో ప్రతి గ్రామానికి నీళ్లు ఇచ్చుకుందాం. గజ్వేల్ లో 65 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నాము. మనం గెలుచుడు కాదు పక్కన ఉన్న 3 నియోజకవర్గాలను గెలిపించాలని కోరుతున్నా. అభివృద్ధి ఆగవద్దు అంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి. గెలుస్తుంది. గెలుస్తున్నాం నాకు డౌట్ లేదు. 95 నుండి 105 స్థానాల్లో గెలుస్తున్నాం. నేను కామారెడ్డిలో పోటీ చేయడానికి ఓ కారణం ఉంది. మీకు ఏం కావాలో నేను చేపిస్తా. వచ్చే టర్మ్ లో నెలకు ఒక్క పూట గజ్వేల్ నియోజకవర్గంలోనే ఉంటా. మీతోనే గడుపుతా” అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.