హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో జరుగుతున్న స్టేట్ లెవెల్ బాక్సింగ్ పోటీల్లో గందరగోళం నెలకొంది. బాక్సర్లు, కోచ్‌లు ఒకరినొకరు కొట్టుకున్నారు. బాక్సింగ్ రింగ్‌లో పోటీ పడాల్సిన బాక్సర్లు దాని బయట ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇద్దరు బాక్సర్ల మధ్య మ్యాచ్ జరగగా, తప్పుడు అంపైరింగ్ కారణంగా ఓడిపోయామని ఆరోపిస్తూ దాడికి దిగింది ఓడిపోయిన టీమ్. తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునేందుకు గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు బాక్సర్లు, కోచ్‌లు.
బాక్సింగ్ అనేది శారీరక, మానసిక క్రమశిక్షణతో కూడిన క్రీడ. దీనికి చాలా శిక్షణ, ఓర్పు, బలం, వేగం, వ్యూహాత్మక ఆలోచన అవసరం. కానీ, ఇవాళ బాక్సర్లు కేవలం శారీరక బలాన్ని మాత్రమే వాడి క్రమశిక్షణ, ఓర్పువాటిని వంటి మర్చిపోయారు. వీధుల్లో అల్లరిచిల్లరగా పిల్లల్లా ప్రవర్తించారు.