మృగశిర కార్తె సందర్భంగా చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభం.. ఎప్పటి వరకు పంపిణీ చేస్తారంటే?

చేప మందు ప్రసాదం పొందేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు, ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 34 కౌంటర్లతో ..

Chepa Mandu Prasadam Distribution

Chepa Mandu Prasadam Distribution : మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు చేప మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి మంత్రిపొన్నం ప్రభాకర్ చేపమందుపంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మెట్టు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : తీన్మార్ మల్లన్న విజయం..! పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు..!

చేప మందు ప్రసాదంకోసం.. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. వారికోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. రెండ్రోజుల ముందే చేప మందుకోసం చాలా మంది నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంకు చేరుకుని షెడ్లలో బస చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు వచ్చేవారికోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఉదయం 9గంటలకు ప్రారంభమైన చేప మందు పంపిణీ కార్యక్రమం.. 24గంటలపాటు సాగనుంది. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 1,60,000 చేప పిల్లలను సిద్ధం చేశారు. చేప మందు పొందేందుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టోకెన్ తీసుకున్న వారికే చేపమందు ప్రసాదం పంపిణీ చేయనున్నారు. చేప మందు పంపిణీ ప్రాంతంలో 1200 మంది పోలీసులతో బందో బస్త ఏర్పాటు చేశారు.

Also Read : Ramoji Rao Passed Away : ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మృగశిర కార్తి సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చేప మందు పంపిణీ జరుగుతుందని తెలిపారు. చాలా కాలంగా చేప మందు పంపిణీ విశ్వాసంతో ప్రజలు వేసుకుంటున్నారు. 150 సంవత్సరాలుగా బత్తిని కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ చేప మందు వేసుకుంటారు. వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ చేప ప్రసాదంకోసం వస్తున్నారు. బత్తిని కుటుంబంలోని మొత్తం ఈ చేప ప్రసాదం వేయడానికి ఇక్కడే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేప ప్రసాదంకోసం చేపలు ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు