Chikoti Praveen : చికోటి ప్రవీణ్ సెక్యూరిటీ సిబ్బంది కేసు రిమాండ్ రిపోర్ట్.. పరారీలో చికోటి

సాయుధ వ్యక్తిగత గార్డులుగా కొనసాగేందుకు నిందితులకు అధికారం లేదని చెప్పారు. A1చికోటి ప్రవీణ్, A2సుందర్ నాయక్, A3 రాకేష్, A4 రమేష్ గౌడ్ గా పోలీసులు పేర్కొన్నారు.

Chikoti Praveen

Chikoti Praveen Security Remand : చికోటి ప్రవీణ్ సెక్యూరిటీ సిబ్బంది కేసు రిమాండ్ రిపోర్ట్ 10టీవీ చేతికి చిక్కింది. చికోటి ప్రవీణ్ పరారీలో ఉన్నారు. చికోటి ప్రవీణ్ పై పోలీసులు నాన్ బెయిల్ కేసులు నమోదు చేశారు. A1గా చికోటి ప్రవీణ్ ను కీలక నిందితుడుగా పేర్కొన్నారు. హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజ బోనాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. మూడు లైవ్ రౌండ్స్ రివాల్వర్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

చికోటి ప్రవీణ్ తో పాటు మరో ముగ్గురిపై ఛత్రినాక పోలీసులు కేసులు నమోదు చేశారు. U/s: 420,109 ఐపీసీ మరియు సెక్షన్ 25(1A),(1B) సెక్షన్ 30 of Arms యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. చీటింగ్ తో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి. లైసెన్స్ లేకుండా అక్రమంగా ప్రైవేట్ సెక్యూరిటీ చికోటి ఏర్పాటు చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

Chikoti Praveen Security Personnel : చికోటి ప్రవీణ్ సెక్యూరిటీ సిబ్బందిపై కేసు నమోదు

సాయుధ వ్యక్తిగత గార్డులుగా కొనసాగేందుకు నిందితులకు అధికారం లేదని చెప్పారు. A1 చికోటి ప్రవీణ్, A2 సుందర్ నాయక్, A3 రాకేష్, A4 రమేష్ గౌడ్ గా పోలీసులు పేర్కొన్నారు. వీరికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ కు విధించారు. A2 సుందర్ నాయక్, A3 రాకేష్, A4 రమేష్ గౌడ్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు.