New Districts Courts : తెలంగాణలో కొత్త జిల్లాల కోర్టులను ప్రారంభించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్

హైకోర్టు ప్రాంగణం నుంచి కొత్త జిల్లాల కోర్టులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 32 జిల్లా కోర్టులు ఏర్పాటు చేశారు.

New Districts Courts : తెలంగాణలో న్యాయ వ్యవస్థ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల కోర్టులు ప్రారంభమయ్యాయి. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ కోర్టులను ఇవాళ ప్రారంభించారు. హైకోర్టు ప్రాంగణం నుంచి కొత్త జిల్లాల కోర్టులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 32 జిల్లా కోర్టులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో కొత్త భవనాలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించింది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ రోజునే జిల్లా కోర్టులను ప్రారంభించడం సంతోషకరమన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా సత్ఫలితాలు వస్తాయని చెప్పారు. అన్ని విభాగాల్లో రాష్ట్రం పురోగమనంలో ఉందని పేర్కొన్నారు.

CM KCR : దేశానికే ఆదర్శంగా తెలంగాణ : సీఎం కేసీఆర్

ఐటీ సహా పలు విభాగాల్లో తెలంగాణ దూసుకుపోతోందన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని తెలిపారు. జీఎస్ డీపీ, తలసరి ఆదాయంలో నెంబర్-1 గా ఉన్నామని తెలిపారు. ఎన్నో అంశాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.

ట్రెండింగ్ వార్తలు