CJI NV Ramana : రామప్ప దేవాలయాన్ని సందర్శించిన సీజే ఎన్వీరమణ దంపతులు

తెలంగాణలోని సుప్రసిధ్ధ రామప్ప దేవాలయాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ఈరోజు సాయంత్రం సందర్శించుకున్నారు.

CJI NV Ramana : తెలంగాణలోని సుప్రసిధ్ధ రామప్ప దేవాలయాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ఈరోజు సాయంత్రం సందర్శించుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట లోని శ్రీ రామలింగేశ్వర స్వామి రామప్ప ఆలయానికి విచ్చేసిన జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు జిల్లా ఎస్పీ సంగ్రాం సింగ్ జి పాటిల్ ఆధ్వర్యంలో పోలీసులు గౌరవం వందనంతో స్వాగతం పలికారు.

అనంతరం ఆలయ అర్చకులు, న్యాయవాదులు శాలువాతో సత్కరించి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రామప్ప ఆలయంలో రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జస్టిస్ రమణ  దంపతులకు వేదపండితులు  ఆశీర్వచనం ఇచ్చారు.  అనంతరం ఆలయ గైడ్ రామప్ప దేవాలయ శిల్ప కళా సంపద విశిష్టత  గురించి వారికి వివరించారు. కాకతీయ కళాఖండాలకు  ప్రతీక అయిన రామప్ప శిల్పాలను చూసి చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ అబ్బుర  పడిపోయారు.

Also Read : Tirumala Udayastamana seva : తిరుమల ఆలయంలో ఈ టికెట్ ధర రూ. 1.5 కోట్లు

సుప్రీంకోర్టు జస్టిస్ రామప్ప గుడికి రావడంతో పోలీసులు అడుగడుగున గట్టి భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవిత ,స్థానిక ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క,  తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు వరంగల్ జిల్లా మెజిస్ట్రేట్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు