Site icon 10TV Telugu

Holidays For Schools, Colleges : కరోనా టెన్షన్.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

Holidays For Schools, Colleges

Holidays For Schools, Colleges

Holidays For Schools, Colleges : తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 8వ తేదీ నుంచి 16 తేదీ వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా, సెలవుల్లో విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని చెప్పింది.

Fenugreek Seeds : చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గించే మెంతులు

తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్​ వైద్యారోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు, ఆ శాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు కేసీఆర్.

YSR Rythu Bharosa : రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభణ మొదలైంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా కోవిడ్ కొత్త కేసులు భారీగా పెరిగాయి. దీంతో ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కట్టడికి ఆంక్షలు విధించారు. భారత్‌లోనూ ఒమిక్రాన్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కరోనా కట్టడికి ఆంక్షలు విధిస్తున్నాయి.

Exit mobile version