Kcr (1)
Telangana Electricity Charges : తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు సీఎం కేసీఆర్ అనుమతించారు. ఈఆర్‌సీ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలన్నారు. పేద వర్గాలపై భారం పడకుండా చూడాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. విద్యుత్‌కు సంబంధించిన సమస్యలపై ఆయన ఆరా తీశారు. విద్యుత్ ప్రాజెక్టుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, త్వరగా కొత్త విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తేవాలని ఆదేశాలు జారీ చేశారు. సోలార్ పవర్‌పై దృష్టి సారించాలన్నారు సీఎం కేసీఆర్.
Read More : Weather Report : ఉత్తరభారతావనిలో చలిగాలులు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు
విద్యుత్ ఛార్జీల పెంపునకు కేంద్రప్రభుత్వ విధానాలే కారణమంటోంది తెలంగాణ ప్రభుత్వం. టన్నుకు 50 రూపాయలు ఉండే గ్రీన్ ఎనర్జీ సెస్‌ను 4వందల రూపాయలకు పెంచింది కేంద్రం. దీంతో గడిచిన ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వంపై 7 వేల200 కోట్ల ఆదనపు భారం పడిందంటోంది తెలంగాణ సర్కార్. బొగ్గు ధరలను ఆరు నుంచి పది శాతం పెంచడంతో డిస్కమ్‌లపై ప్రతి సంవత్సరం అదనంగా 7వందల 25 కోట్ల భారం పడుతోందని వాదిస్తోంది. అంతేగాకుండా గడిచిన నాలుగు ఏళ్లలో బొగ్గు రవాణా రైల్వే ఛార్జీలు 40 శాతం మేర పెరిగాయని చెబుతోంది. డిస్కమ్‌లపై భారాన్ని తగ్గించేందుకు విద్యుత్ ఛార్జీలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఛార్జీలు స్వల్పంగానే పెంచుతామని చెబుతోంది. అయితే ఎంతమేర అన్నది ఈ రెండు రోజుల్లో తేలనుంది.