cm kcr has decided to give profits to singareni workers
cm kcr has decided to give profits to singareni workers : సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. సింగరేణి ఉద్యోగులకు సంస్థ లాభాల్లో వాటాను ఇవ్వాలని నిర్ణయించారు. సింగరేణి కాలరీస్ సంస్థ..2021 -22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
సీఎం ఆదేశాల మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు వెంటనే చెల్లించాల్సిందిగా..సింగరేణి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ కు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంట్లో భాగంగా, అర్హులైన కార్మికులకు 368 కోట్ల రూపాయలను సింగరేణి సంస్థ చెల్లించనున్నది. కార్మికులకు దసరాలోపు చెల్లించాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో అర్హులైన కార్మికులకు దసరా కానుక అందనుంది.
2020-2021లో కార్మికులకు లాభాల్లో వరుసగా 28 శాతం..29 శాతం వాటాను దసరా కానుకగా చెల్లించారు. 2021-22 సంవత్సరానికి గాను సింగరేణి సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను సంస్థ కార్మికులకు దసరా కానుక అందించాలన్నారు సీఎం కేసీఆర్. ఈక్రమంలో సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు అందాయి. త్వరలో అర్హులైన కార్మికులకు ప్రోత్సాహకం అందనుంది.