Tribal and Adivasi Bhavans
Tribal And Adivasi Bhavans : హైదరాబాద్ లో గిరిజన, ఆదివాసీ భవన్ లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. బంజారాహిల్స్ లో సంత్ సేవాలాల్, కుమ్రం భీమ్ ఆదివాసీ భవన్ లకు శనివారం(సెప్టెంబర్ 17,2022) ఆయన ప్రారంభోత్సవం చేశారు. బంజారాహిల్స్ లో రూ.24.68 కోట్లతో ఆదివాసీ భవన్, రూ.24.43 కోట్లతో బంజారా భవన్ ను నిర్మాణం చేయనున్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బంజారాహిల్స్ బంజారాలకు స్థలం లేదు..ఇప్పుడు బంజారాహిల్స్ లో భవనం నిర్మించుకున్నామని తెలిపారు. దేశ గిరిజనులకు ఇది ఓ గౌరవం అన్నారు. ప్రత్యేక ఆహార్యం, సంస్కృతి, సంప్రదాయం బంజారాల సొంతం అని కొనియాడారు.
గిరిజనుల సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉందన్నారు. బంజారా బిడ్డల భవిష్యత్ కోసం బంజారాభవన్ లో చర్చలు జరగాలని చెప్పారు. పోడు భూముల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.