CM KCR: రెండ్రోజులుగా వీక్‌గా ఉన్న కేసీఆర్.. యశోదా డాక్టర్ ఎంవీ రావు ఏమన్నారంటే..

తెలంగాణ సీఎం కేసీఆర్ యశోదా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. జనరల్ చెకప్ కోసమే వెళ్లారని చెబుతుండగా.. వైద్యులు ఆయనకు మరిన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని..

Cm Kcr (1)

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ యశోదా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. జనరల్ చెకప్ కోసమే వెళ్లారని చెబుతుండగా.. వైద్యులు ఆయనకు మరిన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అంటున్నారు. రెండ్రోజులుగా నీరసంగా ఉండటంతో హాస్పిటల్ కు వెళ్లిన కేసీఆర్.. ఎడమ చేయి, ఎడమ కాలు లాగుతుందంటూ వైద్యులను సంప్రదించారు.

రెగ్యూలర్‌గా సీఎం కేసీఆర్‌కు ట్రీట్మెంట్ అందించే డా.ఎంవీ రావు పర్యవేక్షణలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

‘సీటీ స్కాన్ తో పాటు యాంజియోగ్రామ్ పరీక్ష చేసి కారణం తెలుసుకుంటాం. ప్రస్తుతం ఆయనకు బీపీ, షుగర్ లెవల్స్ నార్మల్ గానే ఉన్నాయి. మామూలుగా ఏటా ఫిబ్రవరిలో జనరల్ చెకప్ నిర్వహిస్తాం. ప్రస్తుతం ఎడమ చేయి, ఎడమ కాలు నొప్పిగా ఉందని చెప్పడంతో ఈ పరీక్షలు చేస్తున్నాం. రెండు గంటలు తర్వాత ఫలితాలను బట్టి కండిషన్ గురించి చెప్తామని’ వైద్యులు డాక్టర్ ఎంవీ రావు అన్నారు.

Read Also : యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్

ఉన్నట్టుండి కాలు, చేయి నొప్పిగా ఉండటంతో శుక్రవారం వెళ్లాల్సిన యాదాద్రి పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు సీఎం కేసీఆర్.