CM KCR : యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్

వైద్యులు కేసీఆర్ కు సీటీస్కాన్, యాంజియోగ్రామ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేటి యాదాద్రి పర్యటన కూడా రద్దు చేసుకున్నారు.

CM KCR : యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్

Kcr (4)

Updated On : March 11, 2022 / 12:05 PM IST

CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లారు. జనరల్ చెకప్ కోసం ఆయన ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు కేసీఆర్ కు సీటీస్కాన్, యాంజియోగ్రామ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేటి యాదాద్రి పర్యటనను కూడా కేసీఆర్ రద్దు చేసుకున్నారు.

రెండు రోజులుగా సీఎం కేసీఆర్ వీక్ గా ఉన్నారని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. తన ఎడమ చేయి లాగుతున్నట్లు కేసీఆర్ చెప్పారని వెల్లడించారు. ప్రాథమిక పరీక్షల తర్వాత యాంజియోగ్రామ్ చేస్తామన్నారు. జనరల్ చెకప్ లో భాగంగా ఉండే అన్ని పరీక్షలూ నిర్వహిస్తామని తెలిపారు.

CM KCR : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. 91,142 ఉద్యోగ పోస్టుల భర్తీ, 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్

సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని డా.ఎంవీ రావు పేర్కొన్నారు. అన్ని పరీక్షలూ పూర్తవ్వడానికి 3-4గంటల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. మధ్యాహ్నం వరకూ యశోద ఆస్పత్రిలోనే సీఎం కేసీఆర్ ఉండనున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత, ఎంపీ సంతోష్ ఉన్నారు.