CM KCR : దేశంలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : సీఎం కేసీఆర్

విదేశాల్లో చదువుకునే పేద పిల్లలకు రూ.20 లక్షల స్కాలర్ షిప్ ఇస్తున్న ఏకైకా రాష్ట్రం మనదేనని తెలిపారు. ఆరేడు ఏళ్లలో తెలంగాణ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగిందో మీ అందరికీ తెలుసన్నారు.

Kcr

CM KCR : దేశంలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ అన్నారు. మీరిచ్చిన బలంతోనే అది సాధ్యమైందన్నారు. దేశంలో రూ.2 వేలు ఫించన్ ఇస్తున్న ఏకైకా రాష్ట్రం కూడా తెలంగాణేనని తెలిపారు. రాష్ట్రంలో మంచినీటి సమస్య లేదన్నారు. శాశ్వతంగా మంచినీళ్ల బాధ పోయిందని తెలిపారు. నారాయణ్ ఖేడ్ లో సోమవారం (ఫిబ్రవరి 21,2022) సీఎం కేసీఆర్ పర్యటించారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సంగారెడ్డి ప్రాంతాన్ని పాలకులు పట్టించుకోలేదన్నారు. 14 ఏళ్లు కొట్లాడిన తర్వాత తెలంగాణ వచ్చిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడే ముందు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఎవరైతే మాట్లాడారో వాళ్ల దగ్గరే ఇప్పుడు కరెంట్ లేదన్నారు.

CM KCR : దేశం దశ, దిశను మార్చడానికి ప్రయత్నిస్తున్నాం – సీఎం కేసీఆర్

విదేశాల్లో చదువుకునే పేద పిల్లలకు రూ.20 లక్షల స్కాలర్ షిప్ ఇస్తున్న ఏకైకా రాష్ట్రం మనదేనని తెలిపారు. విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. ఆరేడు ఏళ్లలో తెలంగాణ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగిందో మీ అందరికీ తెలుసన్నారు.