×
Ad

KCR Tamil Nadu : కమల్‌‌తో సీఎం కేసీఆర్ భేటీ ?

యాదాద్రి ప్రారంభానికి స్టాలిన్‌‌ను ఆహ్వానించారు సీఎం కేసీఆర్‌. ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌తో...

  • Published On : December 15, 2021 / 07:43 AM IST

Kamal

KCR And Kamal Haasan : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అద్భుతమైన సమయాన్ని గడిపినట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. సీఎం కేసీఆర్ తనను మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వివరాలను వెల్లడించారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్టాలిన్‌తో కుటుంబసమేతంగా భేటీ అయ్యారు. జాతీయ, రాజకీయ పరమైన అంశాలు, పాలనాపరమైన విషయాలపై ఇద్దరు సీఎంలు చర్చించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను విశ్లేషించి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై సమాలోచనలు చేసినట్లు తెలిసింది.

Read More : Petrol And Diesel : పెట్రోల్, డీజిల్ ధరలు…ఏ నగరంలో ఎంత ?

దేశంలో కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర కూటమి ఏర్పాటుపై చ‌ర్చించినట్లు తెలుస్తోంది. ఇక, యాదాద్రి ప్రారంభానికి స్టాలిన్‌‌ను ఆహ్వానించారు సీఎం కేసీఆర్‌. ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌తో కేసీఆర్‌ 2021, డిసెంబర్ 15వ తేదీ సమావేశం అయ్యే అవకాశం ఉంది. దక్షిణాది ప్రముఖులతో భేటీలో భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ గొప్ప అతిథ్యానికి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇక స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ భేటీ కావడం ఇది మూడోసారి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సమయంలో కరుణానిధి, స్టాలిన్‌ను కలిశారు కేసీఆర్. ఆ తర్వాత ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం సమయంలోనూ సమావేశమయ్యారు. ఇప్పుడు మూడోసారి ఆయనను కలిశారు సీఎం కేసీఆర్.