KCR met Nitin Gadkari : నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం కేసీఆర్

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు కేంద్ర ఉపరితల రవాణ,జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయ్యారు.

KCR met Nitin Gadkari :  ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు కేంద్ర ఉపరితల రవాణ,జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయ్యారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ, ఆధునీకరణ, కొత్త లైన్ల మంజూరుకు సంబంధించి ప్రతిపాదనలను సీఎం కేసీఆర్, గడ్కరీకి అందచేశారు.

ఎన్.హెచ్ 165 హైదరాబాద్ (ఓఆర్ఆర్)- కల్వకుర్తి వరకు ఉన్న రహదారి నాలుగు లైన్ల రహదారిగా గుర్తించాలని సిఎం కేసీఆర్ గడ్కరీని కోరారు. 2021-2022, 2022-2023 రెండు ఆర్థిక సంవత్సరాల్లో సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(సిఆర్ఐఎఫ్) కింద పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలను తక్షణమే ఆమోదించాలని కూడా సీఎం గడ్కరీ కి విజ్ఞప్తి చేశారు.

సిఆర్ఐఎఫ్ కింద ఏడాదికి రూ.‌ 250 కోట్లు రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని కోరిన కేసీఆర్…చౌటుప్పల్-షాద్ నగర్- సంగారెడ్డి మధ్య 182 కిలో మీటర్ల సదరన్ ఎక్స్‌ప్రెస్ వే (రీజనల్ రింగ్ రోడ్డు)ను మంజూరు చేయాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన ఎన్.హెచ్ 65 ను ఆరు లైన్ల రహదారిగా మార్చే అంశంపై దృష్టి సారించాలని కేసీఆర్ ఇచ్చిన వినతిపత్రంలో పేర్కోన్నారు.

ఎన్.హెచ్ 65 ను ఆరు లైన్ల రహదారి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని…నాలుగు కీలకమైన రాష్ట్ర రహదారులు.. చౌటుప్పల్-అమన్ గల్- షాద్ నగర్- కందీ, కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం, కొత్త కోట-గూడురు మీదుగా మంత్రాలయం వరకు, బీదర్-జహీరాబాద్-బీదర్ లను జాతీయ రహదారులుగా మంజూరు చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

ట్రెండింగ్ వార్తలు