CM KCR : రూ.70 గడియారం కావాలా..? ఆత్మగౌరవం కావాలా..? : సీఎం కేసీఆర్

కొంతమంది గడియాలు, డబ్బులు పంచుతున్నారని అదేనా రాజకీయం అంటే ..? అంటూ ప్రశ్నించారు. రూ.70ల గడియారం కావాలా..? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కావాలా..? ఆగమాగం కాకుండా.. ఆలోచించి ఓటువేయాలని ప్రజలకు సూచించారు.

CM KCR in Sathupalli

CM KCR in Sathupalli : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ బాస్ సీఎం కేసీఆర్ రోజు రోజుకు దూకుడు పెంచుతున్నారు. ఒకే రోజు రెండు మూడు సభల్లో పాల్గంటున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా తనదైన శైలిలో ప్రసంగిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు సత్తుపల్లి సభలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ను గెలవనివ్వం అని కొంతమంది అంటున్నారు..కానీ అది అంత తేలిక కాదన్నారు. సత్తుపల్లిలో బీఆర్ఎస్ ను గెలిపించి సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

గెలుపు కోసం అడ్డమైన పనులు చేసేవారిని నమ్మవద్దని..డబ్బులు, వస్తువులు ఇచ్చి ఓటు వేయమంటే వేయవద్దని సూచించారు. వాటికి ఆశపడి ఓటు వేస్తే ఐదేళ్లు అభివృద్ధికి దూరమవుతారని అన్నారు. కొంతమంది గడియాలు, డబ్బులు పంచుతున్నారని అదేనా రాజకీయం అంటే ..? అంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు. రూ.70ల గడియారం కావాలా..? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కావాలా..? ఆగమాగం కాకుండా.. ఆలోంచి ఓటువేయాలని ప్రజలకు సూచించారు. గడియారాల కోసం పైసల కోసం కక్కుర్తి పడొద్దని..బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట వీరయ్యకు ఓటు వేసి గెలిపించి సత్తుపల్లి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. నాలుగు పైసలున్నాయని కొంతమంది ఎగిరెగిరి పడుతున్నారు..కానీ పైసలు కాదు కావాల్సింది..అభివృద్ధి చేసే నేతలు కావాలన్నారు.

కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించకపోయినా మేం పాటిస్తాం : కూనంనేని

ఎన్నికలు వస్తే వచ్చే కొన్ని రాజకీయ పార్టీలుంటాయి వాటిని నమ్మొద్దన్నారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తోందని..మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెస్తోందని అలా జరిగితే రైతులు నష్టపోతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని తెగేసి చెప్పానని తెలిపారు. కారు గుర్తుకే ఓటు వేసి సత్తుపల్లి ప్రజల సత్తా చాటాలని కేసీఆర్ పదే పదే పిలుపునిచ్చారు. సత్తుపల్లి చాలా చైతన్యవంతమైన ప్రాంతమని అటువంటి సత్తుపల్లి ప్రజలు విచక్షణ కలిగి ప్రలోభాలకు లొంగకుండా ఓట్లు వేయాలని సూచించారు.