CM KCR Press Meet : ఒకటే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తా – కేసీఆర్
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. సోమవారం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
- kunduru Vinod
- Published On : November 8, 2021 / 05:08 PM IST
Cm Kcr Press Meet
CM KCR Press Meet : బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. సోమవారం ప్రగతిభవన్ లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ తెలంగాణ బిల్లు పాసైనప్పుడు తాను ఓటేయలేదు అని బండి సంజయ్ అంటున్నాడు. ఆయన మాటలు వింటుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడ? నువ్వు ఎవరికి తెలుసు ఈ రాష్ట్రంలో అని ప్రశ్నించారు. ఇప్పుడొచ్చి దుంకుతా అంటే నడవడిని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
చదవండి : CM KCR : బండి సంజయ్ వ్యాఖ్యలకు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
కథ తేల్చే దాకా నేనే మాట్లాడుతా. వదిలిపెట్టను. ప్రతి రోజు మాట్లాడుతా. గారడీ చేస్తామంటే నడవనివ్వనని అన్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందుతోంది. నీ ఇంటికి కూడా మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి కదా? అని ప్రశ్నించారు.
గొర్రెల పైసల్లో ఒక్క పైసా కేంద్రానిది ఉందని తేలితే నేను ఒకటే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించారు సీఎం కేసీఆర్. నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంక్ వద్ద గొర్రెల పథకానికి పైసలు అప్పుగా తీసుకున్నాం. వడ్డీతో సహా తిరిగి కడుతున్నాం. నీవు ఇచ్చింది ఏం తోక. అబద్దాలు మాట్లాడటం సరికాదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో కూడా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు.
చదవండి : CM KCR : ప్రశ్నిస్తే దేశద్రోహి ముద్ర వేస్తారా? -సీఎం కేసీఆర్- Live Updates
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, పెన్షన్లు ఇస్తున్నారా? అని బండిని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడితే పక్క దేశాలకు పోవాలని అంటున్నారు. అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు.. కేంద్రాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులని ముద్ర వేస్తున్నారని కేసీఆర్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
