‘కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’….రేపు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

కరోనాపై గురువారం (మార్చి 19, 2020) సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సమావేశం నిర్వహించనున్నారు.

  • Publish Date - March 18, 2020 / 04:08 PM IST

కరోనాపై గురువారం (మార్చి 19, 2020) సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సమావేశం నిర్వహించనున్నారు.

కరోనాపై గురువారం (మార్చి 19, 2020) సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చే వారు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేసుకోవాలని విన్నవించారు.

కరోనా వైరస్ తెలంగాణలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 6కి చేరింది. యూకే నుంచి వచ్చిన వ్యక్తి కరోనా వైరస్ బారినపడ్డాడు. వెంటనే ఆ వ్యక్తిని అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో కరోనా బారిన పడిన తొలి వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స తర్వాత అతడికి నయమైంది. ఇంటికి పంపేశారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ వైరస్ వ్యాపించకుండా..పలు చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా..మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, పబ్బులు, బార్లు, ఇతరత్రా మూసివేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం (ASI) ప్రధాన పర్యాటక కేంద్రాలను మూసివేసింది. 2020, మార్చి 17వ తేదీ మంగళవారం నుంచి గోల్కొండ, చార్మినార్, వరంగల్ కోట తదితర ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు..వేయిస్థంబాల దేవాలయం, రామప్ప గుడి, గద్వాల జోగుళాంబ దేవాలయాలకు తక్కువ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలపై కూడా దృష్టి సారించింది. ఆలయాల్లో పరిశుభ్రత చర్యలు ముమ్మరం చేశారు. కరోనా వైరస్ వ్యాపించే విధానం, దానిని నియంత్రించేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై ప్రచారం ముమ్మరం చేశారు. అందులో భాగంగా..ఏప్రిల్ 02వ తేదీన వచ్చే శ్రీరామ నవవి ఉత్సవాలపై అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణాన్ని పూర్తిగా..ఆలయ కార్యక్రమంగా పరిమితం చేశారు. అర్చకులు, ప్రభుత్వ ప్రతినిధులు, ఉద్యోగులు మాత్రమే పాల్గొనేలా చర్యలు చేపట్టారు. సాధారణ భక్తులు రాకుండా..కట్టడి చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఆన్ లైన్ టికెట్లను రద్దు చేశారు. బలవంతంగా భక్తులు రాకుండా కట్టడి సాధ్యం కానందున..స్వచ్చందంగా ఆలయ సందర్శన విరమించుకుని ఇళ్లలో వేడుకలు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఉగాది వేడుకలనూ, ఆర్భాటాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రగతి భవన్‌లో నిర్వహించే వేడుకలకు సాధారణ ప్రజలు రాకుండా చూడాలని అనుకుంటున్నట్లు సమాచారం.