భారీ వర్షాలు, వరదలపై కేసీఆర్ సమీక్ష.. రూ.5వేల కోట్లకు పైగా నష్టం!

  • Publish Date - October 15, 2020 / 05:05 PM IST

cm kcr : తెలంగాణలో భారీ వర్షాలు, వరదలపైనా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలతో జరిగిన నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది ప్రభుత్వం. శాఖలవారీగా నివేదికలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.



వర్షాలు, వరదలకు సంబంధించి జరిగిన నష్టానికి కేంద్రానికి నివేదిక పంపేందుకు అవసరమైన చర్యలను చేపడుతోంది. ఈ సమీక్షలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన పంటలు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించి పూర్తిస్థాయిలో చర్చించనున్నారు.



నిర్ణీత పంటల సాగుపై కూడా సమీక్ష నిర్వహించారు. యాసంగి సీజన్ లో నిర్ణీత పంటల సాగు విధానం ఖరారు చేయనుంది. 50 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయాలని కేసీఆర్ సూచించారు.



భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో ప్రాథమిక అంచనాల ప్రకారం.. రూ.5వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు కేసీఆర్ వెల్లడించారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1350 కోట్లు అందించాలని ప్రధాని నరేంద్ర మోడీకి కేసీఆర్ లేఖ రాశారు.