తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఉద్యోగాల భర్తీ!

  • Publish Date - December 13, 2020 / 05:12 PM IST

CM KCR said that notifications will be issued soon to fill all the vacant posts : తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటీని భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల పోస్టులు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి… ఇంకా ఏఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో లెక్క తేలిన తర్వాతే వాటిని భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.