CM KCR : ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం, హుజూరాబాద్ ఉపఎన్నికపై స్పెషల్ ఫోకస్

ఉపఎన్నిక పోరు ఊపందుకోనుంది. కురుక్షేత్రమే అన్న ఈటల మాటలకు ధర్మ యుద్ధంతో సమాధానం చెబుతాము అంటోంది అధికార టీఆర్ఎస్.

CM KCR Huzurabad : ఉపఎన్నిక పోరు ఊపందుకోనుంది. కురుక్షేత్రమే అన్న ఈటల మాటలకు ధర్మ యుద్ధంతో సమాధానం చెబుతాము అంటోంది అధికార టీఆర్ఎస్. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో విజయడంకా మోగించిన టీఆర్ఎస్ హుజూరాబాద్ పై పట్టు కోల్పోకుండా ఉండేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఉపఎన్నికపై గులాబీ బాస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇవాళ మధ్యాహ్నం వరంగల్, కరీంనగర్ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ప్రచారానికి సాగర్ ఉపఎన్నిక ఫార్ములా ఉపయోగించే యోచనలో ఉన్న ఆయన నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

మరోవైపు మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానంలో ఉపఎన్నికకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈటల రాజేందర్ తన నియోజకవర్గంలో అనుచరులతో మంతనాలు జరిపారు. సీఎం కేసీఆర్ పైనే నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ఈటల వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు టీఆర్ఎస్ నేతలు. తాను చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు సీఎం కేసీఆర్ పై ఈటల విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు