కేంద్రంపై రైతులు పిడికిలి బిగించాలి – కేసీఆర్

  • Publish Date - October 31, 2020 / 01:56 PM IST

CM KCR To Inaugurate Rythu Vedika In Kodakandla : కేంద్రంపై రైతులు పిడికిలి బిగించాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. బియ్యం సన్నవైనా..దొడ్డువైనా..రూ. 1880 ఇస్తామని FCI ఆదేశాలు ఇచ్చిందని ఆర్డర్ కాపీని సభకు చూపించారు. దీనికంటే రూపాయి ఎక్కువ ఇస్తే..ధాన్యం కొనమని వెల్లడించిందన్నారు. ఎక్కువ ఇద్దామని అనుకున్నా..ఆ పరిస్థితి లేదని, కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలి తెలంగాణ నుంచే పంపించాలన్నారు.



జనగామ జిల్లా కొడకండ్లలో తొలి రైతు వేదికను 2020, అక్టోబర్ 31వ తేదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ….



https://10tv.in/cm-kcr-to-inaugurate-rythu-vedika/
‘మేడ్చల్ లో ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినాం. మరో కొత్త వేదికకు శ్రీకారం చుట్టినం. భారతదేశంలో, ప్రపంచంలో రైతులకు ఎక్కడ వేదికలు లేవు. ప్రపంచాన్ని శాసిస్తున్న దేశాలు అమెరికా, యూరప్ లో రైతులు నిరసన తెలియచేస్తుంటారు. టన్నుల కొద్ది టమాటాలు, ఆలుగడ్డలను రోడ్ల మీద పడేస్తుంటారు. రైతులకు ఒక ఆర్గనైజేషన్ లేకపోవడమే ఇందుకు కారణం. రైతులు కూర్చొని మాట్లాడానికి స్థలం లేదు. విత్తనాలు వేసుకోవడం, పంటలు అవలింబించాల్సిన మెళుకవలు..ఇలా..మాట్లాడుకొనే పరిస్థితి లేదు.



భారతదేశంలో ఇలాంటి పరిస్థితి అసలు లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తామని అనుకున్నా మీరు ఇవ్వొద్దు..ధాన్యం కొనమని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటుంది. రైతుల బాధలు, ఆత్మహత్యలు కళ్లార చూసి ఏడ్చినా. ముఖ్యమంత్రి అయిన తర్వాత..రాష్ట్రం సాధించుకుని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం. తెలంగాణ రైతాంగం…భారతదేశంలో అగ్రగామిగా ఉండాలని ఆకాంక్షించినం.



వాస్తవాలు తెలుసుకుని చర్చించాలి. ఇండియాలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తలేదు. వారి వారి గ్రామాల్లో కొనే ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2601 రైతు వేదికలు రాష్ట్రంలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని పూర్తి కావాల్సి ఉంది. వారం రోజుల్లో అన్నీ కంప్లీట్ అవుతాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 600 కోట్లు ఖర్చు పెట్టింది. అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.