CM KCR Visit Districts : ఈ నెల 12 నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన.. నూతన సమీకృత కలెక్టరేట్లకు ప్రారంభోత్సవం

సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లను ఆయన ప్రారంభించనున్నారు. ఈ నెల 12వ తేదీన ఉదయం మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.

cm kcr

CM KCR Visit Districts : సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లను ఆయన ప్రారంభించనున్నారు. ఈ నెల 12వ తేదీన ఉదయం మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా  కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ ను  ఆయన ప్రారంభించనున్నారు.  అదే రోజు మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం పర్యటించనున్నారు.

నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. జిల్లాలో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం జిల్లాల్లో అన్ని సదుపాయాలతో సమీకృత కలెక్టర్ కార్యాలయాలను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

CM KCR Inaugurated : మహబూబ్‌నగర్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

ఇప్పటికే మహబూబ్ నగర్ తోపాటు పలు జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలు పూర్తై అందుబాటులోకి వచ్చాయి. వీటిని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో నూతన సమీకృత కలెక్టరేట్లు నిర్మాణాలు అన్ని హంగులతో పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకొన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టర్ కార్యాలయాల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. నిర్మాణాలు పూర్తైన తర్వాత వాటిని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.