CM KCR : తమాషాకి అభ్యర్థులను పెట్టొద్దు.. నిలబడితే గెలవాలి : సీఎం కేసీఆర్

ముదిరాజ్ ల నుండి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలని సూచించారు. నామినేటెడ్ పదవుల్లో ముదిరాజ్ లకు పెద్ద పీట వేస్తామని చెప్పారు.

CM KCR key comments

CM KCR Key Comments : ఎన్నికల్లో నిలబడే పార్టీ అభ్యర్థులపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమాషాకి అభ్యర్థులను పెట్టొద్దని నిలబడితే గెలవాలని పేర్కొన్నారు. 119 సీట్లల్లో 112 మాత్రమే మన లెక్కలోకి వస్తాయని తెలిపారు. గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ వృత్తి పరంగా ముదిరాజ్ లకు న్యాయం జరిగిందన్నారు. ఈటల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీలోకి వచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల తరువాత ముదిరాజ్ లతో సమావేశమవుతానని రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయని భరోసా ఇచ్చారు.

Thummala Nageswara Rao : తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కాంగ్రెస్ పార్టీని గెలిపించి గిఫ్ట్ ఇవ్వాలి : తుమ్మల

ముదిరాజ్ ల నుండి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలని సూచించారు.  నామినేటెడ్ పదవుల్లో ముదిరాజ్ లకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. ఈటల రాజేందర్ ఎవరిని ఎదగనివ్వలేదని విమర్శించారు. బండ ప్రకాష్ ని తీసుకొచ్చి పదవులు ఇచ్చామని పేర్కొన్నారు.