CM KCR Letter : ‘యుక్రెయిన్‌ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులను ఆదుకోవాలి’… ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ

యుక్రెయిన్ నుంచి వచ్చిన తెలంగాణ విద్యార్థులకు మెడికల్ కాలేజీల్లో సీట్లు కేటాయించాలని నిర్ణయించామని, మిగతా రాష్ట్రాల విద్యార్థుల మెడిసిన్ కోర్సు పూర్తయ్యేలా కేంద్రం సహకరించాలన్నారు.

Kcr Letter (3)

CM KCR letter to PM Modi : ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరోసారి లేఖ రాశారు. యుక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదికి తెలంగాణ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు. దేశవ్యాప్తంగా 20వేల మంది విద్యార్థులు యుక్రెయిన్‌లో మెడిసిన్ చేస్తున్నారని.. అందులో 700మంది తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారన్నారు.

CM KCR : ఐఏఎస్‌ సర్వీస్‌ రూల్స్‌ మార్చొద్దు.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

యుక్రెయిన్ నుంచి వచ్చిన తెలంగాణ విద్యార్థులను మెడికల్ కాలేజీల్లో సీట్లు కేటాయించాలని నిర్ణయించామని తెలిపారు. మిగతా రాష్ట్రాల విద్యార్థుల మెడిసిన్ కోర్సు పూర్తయ్యేలా కేంద్రం సహకరించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.