CM KCR Gadwala Tour : జోగులాంబ గద్వాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. ఎస్పీ కార్యాలయం, సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం

సాయంత్రం 6.45 నిమిషాలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రం గులాబీమయంగా మారింది.

CM KCR (2)

Jogulamba Gadwala : సీఎం కేసీఆర్ సోమవారం జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.30 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా కేసీఆర్ గద్వాలకు చేరుకోనున్నారు. మొదటగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం, తరువాత ఎస్పీ కార్యాలయం, సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

21 ఏకరాల్లో రూ.52 కోట్లతో నూతన కలెక్టరేట్ భవనం నిర్మించారు. రూ.38 కోట్లతో నూతన ఎస్పీ కార్యాలయం నిర్మించారు. సాయంత్రం 6.45 నిమిషాలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రం గులాబీమయంగా మారింది. భారీగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి.

Schools Reopen : తెలంగాణలో స్కూల్స్ పునఃప్రారంభం.. జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభం

బహిరంగ సభ ప్రాంగణం ముస్తాబైంది. లక్ష మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ పర్యటనకు ప్రజా ప్రతినిధులు, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. 15 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతను కట్టుదట్టం చేశారు.