మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు: రేవంత్ రెడ్డి

మహిళా సంఘాల సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపునొప్పి ఎందుకని నిలదీశారు.

CM Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి తొలిసారి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పాల్గొంటున్నారు. ఆదివాసీల పోరుగ‌డ్డ ఇంద్రవెల్లి ఆయన పర్యటనకు వేదికైంది.

గతంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో తొలిసారి ఇంద్రవెల్లి దళిత గిరిజనుల ఆత్మగౌరవ సభలో పాల్గొన్న రేవంత్‌… ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌తో సీఎం హోదాలో ఇంద్రవెల్లి గడ్డపై అడుగుపెట్టారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం ఆసిఫాబాద్‌కు బయల్దేరి, కేస్లాపూర్‌లో నాగోబా దేవ‌త‌ను ద‌ర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా సంఘాల సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ… మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపునొప్పి ఎందుకని నిలదీశారు.

మహిళలు ఆత్మగౌరవంతో బలకాలని, అందుకే తాము వారి కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. స్కూల్ యూనిఫాంలు కుట్టు అవకాశం స్వయం సహాయక బృందాలకే ఇస్తామని చెప్పారు.


YS Sharmila: ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష.. అంతకుముందు పలువురు నేతలను కలిసి..