×
Ad

Revanth Reddy birthday : సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ.. మోదీ, చంద్రబాబు, పవన్ సహా..

Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రాజకీయ, సినీ రంగాలతోపాటు వివిధ రంగాల ..

CM Revanth Reddy birthday

Revanth Reddy birthday : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రాజకీయ, సినీ రంగాలతోపాటు వివిధ రంగాల ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ మంత్రి నారాలోకేశ్‌, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, అక్కినేని నాగార్జునతోపాటు పలువురు.. వివిధ రంగాల ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

రేవంత్‌రెడ్డికి ప్రముఖ నటుడు చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో కొనసాగాలని పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

సినీ హీరో నాగార్జున సీఎం రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.