CM Revanth Reddy
గత ప్రభుత్వ పెద్దలు వాళ్ల ఉద్యోగుల గురించి మాత్రమే ఆలోచించారని, బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)లకు అపాయింట్‌మెంట్ లెటర్లు అందించే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్ధమైందని ఒకాయన మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేదని చెప్పారు. ఈ పది నెలల్లో నిరుద్యోగులు చాలా మంది ఉద్యోగాలు పొందారని, రైతులు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారని తెలిపారు. కోటి 5 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ధి పొందారని చెప్పారు.
నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోందని తెలిపారు. 49 లక్షల 90వేల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ కట్టుకున్నారని కానీ.. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం రాగానే 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
తమ ప్రభుత్వం 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్పారు. యువత కల, ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకెళుతుందని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించినప్పుడు యువత తల్లిదండ్రుల్లో ఆనందాన్ని చూశానని చెప్పారు.
అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఎంపికైన మీరు యువతకు రోల్ మోడల్ గా ఉండాలని చెప్పారు. గంజాయి కొకెన్ తీసుకుంటే పట్టుకోవద్దని కొందరు అంటున్నారని, ఫాంహౌస్ లో డ్రగ్స్ తీసుకునే వాళ్లు రోల్ మోడల్ అవుతారా అని ప్రశ్నించారు. ఇటువంటి చీడపురుగులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. గంజాయి కట్టడికి ఎంవీఐలు పనిచేయాలని చెప్పారు.
ఫెర్రిస్ వీల్‌పై బాలికకు ఊహించని విధంగా ప్రమాదం.. రాడ్‌కు చిక్కుకుపోయి జుట్టు మొత్తం ఊడిపోయి..