తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే.. కొత్త రేషన్ కార్డుల కోసం కమిటీ

రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడిగా ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.

New Ration Cards (Photo Credit : Google)

Ration Cards : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ సబ్ కమిటీ రేషన్ కార్డుల జారీకి విధివిధానాలు రూపొందించనుంది. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడిగా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. మరోవైపు క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.

అటు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ క్యాబినెట్ శుభవార్త చెప్పింది. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో హుస్నాబాద్ రైతాంగం చిరకాల స్వప్నం నెరవేరనుంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గౌరవెల్లి ప్రాజెక్ట్ పెండింగ్ పనుల పూర్తి కోసం రూ.437 కోట్లు విడుదలకి క్యాబినెట్ ఆమోదించింది. మంత్రివర్గం నిర్ణయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సహచర క్యాబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు పొన్నం ప్రభాకర్.

క్యాబినెట్ నిర్ణయాలు..
* కేరళలో వాయనాడ్ విపత్తుకు కేబినెట్ ప్రగాఢ సానుభూతి
* బాధిత కుటుంబాలకు తెలంగాణ పక్షాన ఆర్ధిక, వైద్య అన్ని అంశాల్లో సహయ సహకారాలు అందించాలని నిర్ణయం
* మ్యానిఫెస్టోలో చెప్పినట్లు రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటన
* రేషన్ కార్డు, ఆరోగ్ర్యశ్రీ కార్డులు విడివిడిగా ఇవ్వాలని నిర్ణయం
* కొత్త రేషన్ కార్డుల కోసం సబ్ కమిటీ.. (పొంగులేటి, ఉత్తమ్, దామోదరలతో కేబినెట్ సబ్ కమిటీ)
* కొత్త రేషన్ కార్డుల కోసం విధివిధానాలు రూపొందించనున్న సబ్ కమిటీ
* క్రీడాకారులు ఈషాసింగ్, బాక్సర్ నిఖత్ జరీన్ (రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్), క్రికెటర్ సిరాజ్ లకు(టీ20 వరల్డ్ కప్ సాధించిన జట్టులో సభ్యుడు) గ్రూప్ 1 ఉద్యోగం. 600 గజాల జాగా
* రాజీవ్ రతన్ కుమారుడికి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం
* గౌరవెల్లి ప్రాజెక్ట్ పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు రూ.437 కోట్లు కేటాయింపు

కేబినెట్ నిర్ణయాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
గత ప్రభుత్వం గౌరవెల్లి కెనాల్ పై ఆర్భాటం మాత్రమే చూపింది. కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం తరుపున నామినేట్ చేశాం. నిజాం షుగర్ పై గత సర్కార్ మాటలకే పరిమితైంది. శ్రీధర్ బాబు నేతృత్వంలోని సబ్ కమిటీ సూచనలతో ఫ్యాక్టరీ ఓపెన్ కు కావాల్సినవన్నీ చేస్తాం. మూసీ ప్రక్షాళన చేస్తాం. గోదావరి నీటిని హైదరాబాద్ జంట జలాశయాలకు తరలిస్తాం. 10 టీఎంసీలను రాజధానిలోని చెరువులకు, 5 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి కోసం వాడుతాం.

Also Read : సీఎం రేవంత్‌తో పాటు అమెరికా వెళ్లేందుకు కాంగ్రెస్ నేతల తహతహ.. కారణం ఏంటి?

ట్రెండింగ్ వార్తలు