Bhu Bharati Portal : తెలంగాణలో భూభారతి పోర్టల్ ప్రారంభమైంది. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి భూభారతి పోర్టల్ ను ప్రారంభించారు. కోటి మంది ఒకేసారి లాగిన్ చేసినా తట్టుకునేలా సర్వర్ రూపొందించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో భూ భారతి పోర్టల్ తీసుకొచ్చింది సర్కార్. పైలెట్ ప్రాజెక్ట్ గా ఖమ్మం జిల్లా నుంచి నేలకొండపల్లి మండలాన్ని ఎంపిక చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పోర్టల్ పై అవగాహన కల్పించేందుకు అన్ని రైతుల మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు.
Also Read : అడవులను నాశనం చేస్తూ వన్యప్రాణులను చంపుతున్నారు- కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పోర్టల్ రైతులకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించాలని ఆదేశించారు. అలానే భూభారతి వెబ్ సైట్ రాబోయే వందేళ్ల వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సేవలు అందించేలా ఉండాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అలానే సంస్థపై సైబర్ అటాక్స్, భద్రతా పరమైన కోణంలో ఫైర్ వాల్ సేఫ్టీ చూడాలని చెప్పారు.
”ప్రజల కోసం భూ భారతి చట్టం. అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేసి భూ భారతి చట్టం రూపొందించాం. పైలెట్ ప్రాజెక్ట్ కింద మొదటి విడతలో మూడు మండలాల్లో భూ భారతి అమలు చేస్తాం. జూన్ ఒకటిలోపు మూడు మండలాల్లోని సమస్యలను పరిష్కరిస్తాం. భూములున్న వారు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here