CM Revanth Reddy Dynamic Look In Davos
CM Revanth Reddy New Look : తెలంగాణకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ రేవంత్ రెడ్డి చాలా బిజీబిజీగా ఉన్నారు. పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా వారితో ఒప్పందాలు చేసుకుంటున్నారు.
Revanth Reddy New Look
కాగా, దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త లుక్ లో కనిపించారు. సూటుబూటుతో చాలా డైనమిక్ గా కనిపిస్తున్నారు. ఇంతకు ముందు ఎన్నడూ రేవంత్ రెడ్డి ఇలా కనిపించలేదని, గతానికి భిన్నంగా ఆయన డ్రెస్ స్టైల్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. రేవంత్ రెడ్డి న్యూ లుక్ అదుర్స్ అంటున్నారు ఆయన అభిమానులు. సూటుబూటులో ఉన్న రేవంత్ రెడ్డి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
CM Revanth Reddy New Look
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్ ను.. వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్ ట్యాగ్ లైన్‌తో సిద్ధం చేశారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటేలా రూపొందించిన ఈ వేదిక అందరినీ ఆకర్షిస్తోంది. బతుకమ్మ, బోనాల పండుగ, చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నంగా చార్మినార్ నిలిచింది.
తెలంగాణ కళాకారుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, ఐటీ, సాంకేతిక ఆవిష్కరణల కొత్త సౌధం టీ హబ్, స్కైరూట్ ఏరోస్పేస్, విభిన్న రంగాల మేళవింపు ఉట్టిపడేలా తయారు చేసిన వాల్ డిజైనింగ్ ఈ పెవిలియన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు ప్రపంచానికి చాటి చెప్పటంతో పాటు ’ ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ’ పేరుతో ముస్తాబు చేసిన ఈ పెవిలియన్ అందరినీ ఆకట్టుకుంటోంది.
CM Revanth Reddy New Look In Davos
CM Revanth Reddy
’ప్రపంచంలోనే అపారమైన అవకాశాలున్న తెలంగాణ’, ‘పెట్టుబడులకు దేశంలోనే మొట్టమొదటి గమ్యస్థానం తెలంగాణ’ అనే నినాదాలు పెవిలియన్‌కు స్వాగతం పలుకుతున్నాయి.
CM Revanth Reddy In Davos
భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు.. మీ కోసమే తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోర్డింగ్ ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకట్టుకునేలా ఉంది. సంప్రదాయ మేళవింపుతో ఆవిష్కరణలు.. జీవ వైద్య రంగానికి డేటా సైన్స్ జోడీ.. ప్రతిభను ప్రతిబింబించే సాంకేతికత.. పరిశ్రమల నుంచి సమగ్రత.. స్థిరత్వం నుంచి ఆర్థిక వృద్ధి సిద్ధిస్తుందనే తెలంగాణకున్న అనుకూలతలన్నింటినీ దీనిపై ఇంగ్లీష్ కోట్స్‌తో ప్రదర్శించారు.