మెట్రో రైలు సేవలను అక్కడి వరకు విస్తరించే బాధ్యత నాది: రేవంత్ రెడ్డి

బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని చెప్పారు.

ఎల్బీనగర్ వరకు ఉన్న మెట్రో రైలు సేవలను హయత్‌నగర్ వరకు విస్తరించే బాధ్యత తనదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ కార్నర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందిని అన్నారు. సునీత మహేందర్ రెడ్డిని గెలిపిస్తే ప్రజల సమస్యలను పరిష్కరించేందు కృషి చేస్తారని తెలిపారు.

గత లోక్ సభ ఎన్నికల్లో తనను ఆశీర్వదించినట్లే, ఇప్పుడు ఎల్బీనగర్ నుంచి సునీతకు 30 వేల మెజారిటీ ఇవ్వాలని కోరారు. వరద ముంపు సమస్యను పరిష్కరించే బాధ్యత తనదని అన్నారు. ఈటల రాజేందర్ ఏనాడైనా ఈ ప్రాంత ప్రజల సమస్యలను అడిగేందుకు ఇక్కడికి వచ్చారా అని నిలదీశారు.

వరదలు వచ్చినప్పుడు బండి పోతే బండి ఇస్తామని బండి సంజయ్ చెప్పారని అన్నారు. ఏమీ చేయకుండా ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారని తెలిపారు. తెలంగాణను నిండా ముంచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని చెప్పారు. బీజేపీ కి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారట అని వ్యాఖ్యానించారు. విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పా మోదీ తెలంగాణకు రావాలని అన్నారు.

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు, మద్యం

ట్రెండింగ్ వార్తలు