Revanth Reddy: యాదగిరిగుట్టలో బంగారు గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట ఆలయంలో బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు.

Yadagirigutta Temple

Gold Plated Vimana Gopuram: యాదాద్రి శ్రీలక్ష్మి నర్సింహస్వామి ఆలయంలో ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా యాదగిరిగుట్టకు చేరుకున్నారు. వారికి ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఉదయం 11.36 గంటలకు మూల నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామివారి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు.

 

 

 

స్వర్ణ విమాన గోపురం విశేషాలివే..
• స్వర్ణ విమాన గోపురం ఎత్తు: 50.5 అడుగులు
• స్వర్ణ విమాన గోపురానికి ఉపయోగించిన బంగారం మొత్తం : 68 కిలోలు
• బంగారు విమాన గోపురం వైశాల్యం: 10,759 చదరపు అడుగులు
• తాపడం పనులు ప్రారంభించిన తేదీ: 1 డిసెంబరు 2024
• తాపడం కవచాల బిగింపు పనుల పూర్తి: 18 ఫిబ్రవరి 2025
• బంగారు తాపడం బిగింపు ఖర్చు: రూ.5.10 కోట్లు (జీఎస్టీ కాకుండా)
• రాగిరేకుల తయారీ ఖర్చు: రూ.12 లక్షలు
• పనిచేసిన కార్మికులు: 50 మంది
• పనులు చేసిన సంస్థ: నవయుగ మెటల్స్
• స్వర్ణ విమాన గోపురం పనులు చేసిన సంస్థ: ఎంఎస్ స్మార్ట్ క్రియేషన్స్, చెన్నై