×
Ad

కేసీఆర్‌ ఇలాకాలో గెలిచాం.. ప్రజల తీర్పు ఏం చెబుతోందంటే?: పంచాయతీ ఎన్నికలపై రేవంత్‌ రెడ్డి స్పందన ఇదే..

పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.

Revanth Reddy

Revanth Reddy: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అద్భుత విజయం సాధించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజక వర్గంలో మెజార్టీ గ్రామపంచాయతీల్లో విజయం సాధించామని తెలిపారు. కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరని ప్రజల తీర్పు చెబుతోందని అన్నారు.

“ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ను ఆదరించారు. మా పాలనపై ప్రజలు విశ్వాసాన్ని ప్రకటించారు. 66 శాతం ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి.

ఎన్నికలను సజావుగా నిర్వహించిన అధికారులకు అభినందనలు. పార్టీ విజయం కోసం కష్టపడిన కాంగ్రెస్‌ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. 87 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది” అని చెప్పారు.

Also Read: G Ram G: జీ రామ్ జీ బిల్లుకు లోక్‌సభలో ఆమోదముద్ర.. ఇకపై ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ ఉండదు..

బీఆర్ఎస్ ఆరు అసెంబ్లీ నియోజక వర్గాల్లోనే మెజార్టీ స్థానాలు సాధించిందని రేవంత్‌ రెడ్డి అన్నారు. 12,702 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 7,527 కాంగ్రెస్, 808 కాంగ్రెస్‌ రెబల్స్‌ గెలిచారని అన్నారు.