Cm Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ రాజకీయ ప్రయోజనం పొందారు- సీఎం రేవంత్
ప్రాణహిత చేవెళ్లతో కేసీఆర్ కు లాభం లేదని రీడిజైన్ పేరుతో ప్రాజెక్ట్ ను మార్చారు. ప్రాజెక్ట్ పేరు, ప్లేస్, అంచనా వ్యయాన్ని మార్చారు.
- Naveen
- Updated on- April 20, 2026 / 08:07 PM IST
Cm Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ రాజకీయ ప్రయోజనం పొందారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఆనాటి గవర్నర్ తోనూ అబద్దాలు చెప్పించారని వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో అవినీటికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పేరును కుట్రపూరితంగా మార్చారని మండిపడ్డారు.
”ప్రాణహిత చేవెళ్లకు రూ.11,700 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రాణహిత చేవెళ్లతో కేసీఆర్ కు లాభం లేదని రీడిజైన్ పేరుతో ప్రాజెక్ట్ ను మార్చారు. ప్రాజెక్ట్ పేరు, ప్లేస్, అంచనా వ్యయాన్ని మార్చారు. తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ ను అన్నారం, సుందిళ్లకు మార్చారు. కాళేశ్వర ప్రాజెక్ట్ అద్భుతమైనదని ప్రచారం చేశారు” అని రేవంత్ ధ్వజమెత్తారు.
భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. మేడిగడ్డ బ్యారేజీని సీఎం రేవంత్, మంత్రులు పరిశీలించారు. కుంగిన బ్యారేజ్ పిల్లర్లను, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్దరణ పనులను పరిశీలించారు. డ్రోన్ బేస్డ్ జీపీఆర్ టెస్ట్ పై అధికారులు సీఎం రేవంత్ కు వివరించారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాంకేతిక నిపుణులు, మూడు నిర్మాణ సంస్థలతో చర్చించినట్లు రేవంత్ తెలిపారు.
”మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలపై ఎలా ముందుకెళ్లాలో స్పష్టత వచ్చింది. సమస్యను అర్థం చేసుకోవడమే సగం పరిష్కారం. సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్నాకే పనులు మొదలు పెట్టాలి. సేకరించిన శాంపిల్స్ రిజల్ట్ కు అనుగుణంగా పనులు చేపట్టాలి. NDSA మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకెళ్లాలి. ప్రతీ పనిలో NDSA అప్రూవల్ తీసుకుని పని చేయాలి” అని రేవంత్ అన్నారు.
Also Read: బీఆర్ఎస్, బీజేపీ కలుస్తాయా? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు..
