ఇన్ని లక్షల కోట్ల అప్పులతో కేసీఆర్ మాకు ప్రభుత్వాన్ని అప్పగించారు: రేవంత్‌ రెడ్డి

ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని అప్పటి సీఎం, మంత్రులు, అధికారులు ఎవరూ చెప్పలేదని విమర్శించారు.

CM Revanth reddy

బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ఆర్థికంగా క్షీణించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ఏడాది పాలనపై సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ప్రెస్‌ మీట్‌ నిర్వహించి మాట్లాడారు. నెహ్రూ నుంచి రాజశేఖర్ రెడ్డి వరకు రైతుల కోసం ఎంతో చేశారని అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్.. రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందని చెప్పారు.

అప్పులతో కేసీఆర్ రాష్ట్రాన్ని తమకు అప్పగించారని తెలిపారు. రూ.7 లక్షల కోట్ల అప్పు, నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ చెల్లించే దుస్థితికి తీసుకొచ్చారని చెప్పారు. ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని అప్పటి సీఎం, మంత్రులు, అధికారులు ఎవరూ చెప్పలేదని విమర్శించారు.

తాము తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన వెంటనే ఆస్తులు, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేశామని తెలిపారు. నిన్న లక్షలాది మంది రైతులు రైతు పండుగలో పాల్గొన్నారని చెప్పారు. తాము మాట ఇచ్చిన ప్రకారం ఆగస్ట్ 15లోగానే రుణమాఫీ చేశామని తెలిపారు.

గచ్చిబౌలి పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న అధికారులు