Mir Alam Tank : హైదరాబాద్‌లో మరో టూరిజం స్పాట్.. మీరాలం ట్యాంక్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
Mir Alam Tank : హైదరాబాద్ మీరాలం ట్యాంక్‌ను ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా సాగుతున్న పనులను సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.
- Harish Thanniru
- Published on- August 27, 2026 / 09:06 PM IST
CM Revanth Reddy Surprise Inspection Mir Alam Tank Development Works
Mir Alam Tank : హైదరాబాద్ మీరాలం ట్యాంక్‌ను ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా సాగుతున్న పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ సాగుతున్న పనులను ఒక్కొక్కటిగా పరిశీలించారు.
Also Read : Kerala Temple : దేవుడికి నైవేద్యంగా ‘మంచ్ చాక్లెట్’.. ఈ ఆలయం కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
అత్యుత్తమ డిజైన్లతో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. కొనసాగుతున్న పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ద్వారా అధికారులు వివరించారు. ప్రణాళికలను పూర్తిగా పరిశీలించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు.
చెరువులోకి మురుగు నీరు చేరకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే చెరువు నుంచి మూసీలోకి వరద నీరు వెళ్లేలా నాలాను విస్తరించాలని చెప్పారు. పర్యాటకులు చెరువులో వాటర్ స్పోర్ట్స్ కోసం డిజైన్ చేయాలని, చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్‌లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పారు.
అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్నందున మీరాలం చెరువును, పరిసర ప్రాంతాలను పర్యాటకులకు ఆకట్టుకునేలా ఏర్పాట్లు జరగాలని సూచించారు. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పనులను పరిశీలించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
చెరువులోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, మూసీలోకి వరద నీరు సజావుగా వెళ్లేలా నాలా విస్తరణ, వాటర్ స్పోర్ట్స్, ఐలాండ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన సందర్భంగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఉన్నతాధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
మీరాలం చెరువు అభివృద్ధి.. హైదరాబాద్ భవిష్యత్తుకు మరో ముందడుగు.
మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పనులను పరిశీలించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాను.
చెరువులోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, మూసీలోకి వరద నీరు సజావుగా… pic.twitter.com/VL83qkRYYg
— Revanth Reddy (@revanth_anumula) August 27, 2026
