అతిపెద్ద సదస్సు. ఇంటర్నేషనల్ సమ్మిట్. దేశమే కాదు ఏకంగా దునియా దృష్టిని ఆకర్షించేలా పెట్టుబడుల జాతర. కరెక్ట్ సిచ్యువేషన్‌లో..రేవంత్ గ్లోబల్ సమ్మిట్ పెట్టారా.? రెండేళ్లు పూర్తికావడంతో..ఘనంగా మూడో ఏడాదిలోకి ఎంట్రీ ఇచ్చారా.? ఇక పాలనలో మరింత దూకుడు పెంచాలని డిసైడ్ అయ్యారా.? జూబ్లీహిల్స్ గెలుపు సీఎం రేవంత్లో కాన్ఫిడెంట్ లెవెల్స్ భారీగా పెంచిందా.? గ్లోబల్ సమ్మిట్ ఎపిసోడ్ రేవంత్ రెడ్డికి ఇంకా హైప్ తెస్తుందా.? గ్లోబల్ సమ్మిట్‌పై బీఆర్ఎస్, బీజేపీ విమర్శలెందుకు.?
ఒక్కడై పోరాడి..ఉప్పెనలా కమ్మేసి..కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి..తెలంగాణ పాలిటిక్స్‌లో తన మార్క్ క్రియేట్ చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే నభూతో నభవిష్యతి అనేలా గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించారు. తన ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోవడంతో..రాబోయే మూడేళ్లు మరింత దూకుడుగా పనిచేయాలని డిసైడ్ అయ్యారట. మరోసారి అధికారంలోకి రావాలంటే ఇంకా స్పీడ్ పెంచాల్సిందేనని భావిస్తున్నారట. జూబ్లీహిల్స్ విజయం సీఎం రేవంత్లో కాన్ఫిడెంట్ లెవెల్స్ను పెంచేసిందట. అధిష్టానం దగ్గర మంచి మార్కులు పడటంతో ఆయన ఫుల్ జోష్‌లో ఉన్నట్లు నేతలు చర్చించుకుంటున్నారు. దాంతో ఇప్పుడు మరింత దూకుడుగా వెళ్లాలని డిసైడ్ అయ్యారట రేవంత్. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో సరికొత్త రోడ్ మ్యాప్ వేసే ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలను కలుస్తూ..రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలంటూ వినతులు సమర్పిస్తున్నారు. 2047 నాటికి తెలంగాణ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ శక్తిగా ఎదిగే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారట. ఇప్పటికే తెలంగాణ రైజింగ్ నెంబర్ వన్ అనే స్లోగన్‌తో పబ్లిక్ అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నారు. దావోస్‌కు వెళ్లి పెట్టుబడుల తేవడంతో పాటు..లేటెస్ట్‌గా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్‌తో దునియా దృష్టిని అట్రాక్ట్ చేసే స్కెచ్ వేశారట.
గ్లోబల్ సమ్మిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వివిధ దేశాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో పాటు..దేశంలోని దిగ్గజ కంపెనీలను కూడా ఆహ్వానించారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రభుత్వ అధినేతగా తన లక్ష్యమేంటో వివరించారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీతో కంపెనీలను ఆకట్టుకోగలిగారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ కార్స్ డైరెక్టర్ ఎరిక్ లక్ష కోట్ల పెట్టుబడులు ప్రకటించారు. వీరే కాదు బ్రిటన్తో పాటు ఇతర విదేశాలు, దేశీయ దిగ్గజ సంస్థలు కూడా భారీగా పెట్టుబడులను అనౌన్స్ చేశాయి. ఓవరాల్గా ఐదు లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని ప్రభుత్వం చెప్తోంది. సమ్మిట్ ముగిసే నాటికి కనీసం ఐదు లక్షల కోట్ల పెట్టబడులు ఆకర్షించి..ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా తీర్చిదిద్దుతామని..భవిష్యత్ తెలంగాణ రూపురేఖలు మారిపోవడం ఖాయమని చెప్తున్నారు సర్కార్ పెద్దలు.
ఓవైపు తన మార్క్ ఉండేలా..మరోవైపు తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్ పెట్టిన గ్లోబల్ సమ్మిట్..న్యూస్ హెడ్‌లైన్‌గా మారింది. దేశవ్యాప్తంగా చర్చకు కూడా దారితీసింది. అయితే పెట్టుబడులపై రేవంత్ సర్కార్ చేసుకుంటున్న ప్రచారమంతా ఉట్టిదే అని కొట్టిపారేస్తున్నాయి బీఆర్ఎస్, బీజేపీ. మీడియా ప్రచారం, హంగామా తప్ప..ఎన్ని పెట్టుబడులు వచ్చాయో..అందులో ఎంవోయూలు కుదిరినవెన్నో రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదంటూ విమర్శిస్తున్నాయి. రేవంత్ తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు..కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మెప్పులు పొందేందుకు..ప్రజాధనం వృథా చేస్తున్నారని అపోజిషన్ అటాక్ చేస్తోంది. బోగస్ పెట్టుబడులు, ఫేక్ ఎంవోయూల సమ్మిట్ అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా పోస్టులతో హోరెత్తిస్తోంది. కేసులు, విచారణల్లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కంపెనీలు లక్షల కోట్ల పెట్టుబడుల ఎక్కడి నుంచి పెడుతాయో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. 30వేల కోట్ల టర్నోవర్ కంపెనీ..50వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పుకోవడమే..సమ్మిట్ ఏందో..దాంతో వచ్చిన పెట్టుబడులెన్నో అర్థమవుతుందని విమర్శలు చేస్తున్నారు. మొత్తం మీద గ్లోబల్ సమ్మిట్ చుట్టూ పొలిటికల్ డైలాగ్ వార్ మాత్రం కాక రేపుతోంది.
Hon’ble Chief Minister Shri @revanth_anumula addressed the delegates and the people of Telangana at the prestigious #TelanganaRisingGlobalSummit2025, highlighting the state’s progress and outlining the vision for Telangana Rising 2047 – a roadmap for inclusive, sustainable, and… pic.twitter.com/iakJRdQqjS
— Telangana CMO (@TelanganaCMO) December 8, 2025