Cold shaking Telangana
Telangana : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చలి ప్రజలను వణికిస్తోంది. వచ్చే శుక్రవారం నుంచి వచ్చే మూడు రోజుల పాటు చలి విపరీతంగా పెరుగుతందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో అత్యల్పంగా ఉష్ణోగ్రత 10.4 డిగ్రీల సెల్షియస్ కు చేరింది. చలి పెరిగినందువల్ల గుండెజబ్బులున్న వారు, మధుమేహం, హైబీపీ ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. వృద్ధులు, చిన్నారులు బయటకు రావద్దని అధికారులు సూచించారు.
ALSO READ : Smita Sabharwal : మంత్రి సీతక్క బాధ్యత స్వీకార కార్యక్రమంలో తళుక్కుమన్న స్మితా సబర్వాల్
రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి. చలి ప్రభావం వల్ల గొంతులో ఇన్పెక్షన్లు, జలుబు వ్యాధులు వస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. ఆస్తమా రోగులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడతారని బయటకు రావద్దని వైద్యులు కోరారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత 10 నుంచి 13 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డిసెంబరు చివరి వారంలో చలి తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.
ALSO READ : AP Voters List : ఓట్లర్ల జాబితాపై ఈసీకి ఫిర్యాదు చేసిన మూడు పార్టీలు
తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గత రెండు రోజులుగా తూర్పు దిశగా చలిగాలులు వీస్తున్నాయి. డిసెంబరు 17వతేదీ తర్వాత చలి తీవ్రత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. చలితోపాటు చలిగాలులు వీస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సలహా ఇచ్చారు.