T Congress: కాంగ్రెస్‌లో విభేదాలు.. రచ్చబండకు జగ్గారెడ్డి దూరం

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఇవాళ(27 డిసెంబర్ 2021) ఎర్రవల్లిలో నిర్వహించనున్న రచ్చబండను బాయ్‌కాట్‌ చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

Congress

T Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఇవాళ(27 డిసెంబర్ 2021) ఎర్రవల్లిలో నిర్వహించనున్న రచ్చబండను బాయ్‌కాట్‌ చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ ఏకైక ఎమ్మెల్యేగా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న తనకు రచ్చబండ కార్యక్రమంపై సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే.. రచ్చబండ కార్యక్రమాన్ని బాయ్‌కాట్‌ చేస్తున్నానని తెలిపారు జగ్గారెడ్డి. రేవంత్‌రెడ్డి అందర్నీ విడదీసి కార్యక్రమాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలిపారాయన. ఈ విషయంపై అధిష్టానానికి లేఖ రాస్తానని ప్రకటించారు.

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను రైతులకు తెలియజేసేందుకు నేటి నుంచి రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఇవాళ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం.. గజ్వేల్‌లోని ఎర్రవల్లిలో మధ్యాహ్నం 2గంటలకు రచ్చబండ నిర్వహించనుంది.

ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి భారీగా రైతులు తరలిరావాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. జనవరి 3వరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది కాంగ్రెస్‌ పార్టీ. అయితే నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో అప్పుడే విభేదాలు బయటపడుతున్నాయి.