Hyderabad : మీర్‌పేట్‌ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లపై దాడి ?

పాలకవర్గ సమావేశంలో దాడి జరిగిందనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పాలకవర్గం మీటింగ్ జరుగుతుండగా..డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, కార్పొరేటర్లపై దాడి జరిగిందని పుకార్లు షికారు చేశాయి. తమపై పదో డివిజన్‌ కార్పొరేటర్‌ పవన్‌కుమార్‌, అనుచరులు దాడి చేశారంటూ...మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టేందుకు వెళ్లారు.

Meerpet

Meerpet : మీర్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పాలకవర్గంలో ఏం జరుగుతోంది. ఇప్పుడిదే ప్రశ్న నేతల్లో తలెత్తుతోంది. పాలకవర్గ సమావేశంలో దాడి జరిగిందనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పాలకవర్గం మీటింగ్ జరుగుతుండగా..డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, కార్పొరేటర్లపై దాడి జరిగిందని పుకార్లు షికారు చేశాయి. తమపై పదో డివిజన్‌ కార్పొరేటర్‌ పవన్‌కుమార్‌, అనుచరులు దాడి చేశారంటూ…మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టేందుకు వెళ్లారు.

Read More : Traffic Challan: వర్షంలో విచ్ఛలవిడిగా డ్రైవింగ్.. రూ.62వేల ఫైన్ విధించిన పోలీస్

ఆ సమయంలో భారీగా వచ్చిన అనుచరులు కాసేపు నిరసనకు దిగారు. అయితే డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, కార్పొరేటర్లపై దాడి జరిగిందా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్ కు వచ్చిన 10tv ప్రశ్నించింది. కానీ…డిప్యూటీ మేయర్ విక్రమ్‌రెడ్డి సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. ఇక్కడ సొంతపార్టీ నేతలే దాడి చేశారని చెబితే…పరువుపోతుందనే ఆందోళనలో టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సెటిల్‌మెంట్‌ చేసుకున్నారనే ప్రచారం హోరెత్తుత్తుతోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.