BC Reservations: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్.. మంత్రుల కమిటీ ఏర్పాటు.. సభ్యులు వీరే..

యూరియా కొరతపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న రాజకీయాలు కూడా నేతల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం ఎలా ముందుకెళ్లాలి అన్నదానిపై సమాలోచనలు జరిపింది. ప్రభుత్వ పరంగానే 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కొందరు అభిప్రాయపడగా, మరికొందరు అలా కుదరని పక్షంలో పార్టీ పరంగా ఇవ్వాలని వాదించారు. దీంతో బీసీ రిజర్వేషన్లపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి.

చివరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో సభ్యులుగా మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో పాటు సీతక్క ఉన్నట్లు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు.

కాంగ్రెస్ పీఏసీ సమావేశం దాదాపు మూడున్నర గంటల పాటు సాగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ బిల్లుల అంశంపై ఇద్దరు అడ్వకేట్లను నియమించాలని నిర్ణయించారు. బీసీలకు మేలు జరగాల్సిందేనన్న సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ మాట నిలబడాలన్నారు.

ఇక రాష్ట్ర స్థాయిలో పెండింగ్ లో ఉన్నటువంటి కమిటీల నిర్మాణంపై చర్చించారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్ చోరీ ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు.

యూరియా కొరతపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న రాజకీయాలు కూడా నేతల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా డిస్కస్ చేశారు.