Rahul Gandhi
Bharat Jodo Yatra: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర రేపు తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఏపీలో భారత్ జోడో యాత్ర పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ ఇవాళ కర్ణాటకలోని రాయచూర్ లో పాదయాత్ర చేశారు. రేపు ఉదయం తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా గూడెబల్లూరులో ఆయన పాదయాత్ర చేస్తారు. రాహుల్ పాదయాత్ర నేపథ్యంలో టీపీపీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
కర్ణాటక-తెలంగాణ సరిహద్దుల వద్ద రాహుల్ గాంధీ మారథాన్ వాక్ వేళ స్వాగతం పలకనుంది. గూడెబల్లూరులో అల్పాహారం తీసుకున్న దీపావళి సందర్భంగా మూడు రోజుల పాటు రాహుల్ యాత్రకు బ్రేక్ పడుతుంది. అనంతరం ఈ నెల 27న ఉదయం గూడెబల్లూరు నుంచే రాహుల్ యాత్ర మళ్ళీ ప్రారంభం అవుతుంది.
మొత్తం 16 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ యాత్ర కొనసాగుతుంది. ఇందులో భాగంగా 19 అసెంబ్లీ, 7 పార్లమెంటరీ నియోకవర్గాల్లో మొత్తం కలిపి 375 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేస్తారు. అనంతరం మహారాష్ట్రలో పాదయాత్ర ప్రారంభం అవుతుంది.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..