Congress Conducting Satyagraha Deeksha In Gandhi Bhavan
Gandhi Bhavan: హైదరాబాద్ లోని గాంధీ భవన్ వేదికగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు సత్యాగ్రహ దీక్షలో పాల్గొనున్నారు. బీపీఎల్ కుటుంబాలన్నింటికీ కరోనా ట్రీట్మెంట్, బ్లాక్ ఫంగస్ లకు ఉచితంగా చికిత్స అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
మా దీక్షతో నైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దీక్ష చేపట్టనున్నామని ఉత్తమ్ అన్నారు. కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్య శ్రీలో చేర్చి ప్రజలపై భారం తగ్గించాలని కాంగ్రెస్ మొదటి నుంచి డిమాండ్ చేస్తుందని అన్నారు.
గాంధేయ మార్గంలో పేదల పక్షాన దీక్ష చేపట్టాలని పిలుపునివ్వగా కార్యక్రమానికి వీహెచ్ రావడం లేదని చెప్పారు. పీసీసీ ముఖ్యనేతల తీరు నచ్చకపోవడం వల్లే గాంధీ భవన్‌కు రావడం లేదని స్పష్టం చేశారు.