Congress: మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలపై రేవంత్ సర్కారు దృష్టి.. తెరిపించేందుకు ఏం చేస్తుందో తెలుసా?

Sugar Factory: నిజాం దక్కన్ షుగర్స్‌గా మారిన తర్వాత 13 ఏళ్లు నిర్వహణ సమస్యలు ఎదుర్కొంది.

Revanth Reddy

నిజాం షుగర్‌ ఫ్యాక్టరీతో పాటు దాని అనుబంధ కర్మాగారాలపై దృష్టి సారించింది సీఎం రేవంత్‌ రెడ్డి సర్కారు. ప్రైవేట్‌ పరమైన ఈ ఫ్యాక్టరీ మూత పడటంతో వందల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కమిటీ వేసిన ప్రభుత్వం.. రెండు నెలల్లోగా సమ్రగ నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

గత ప్రభుత్వ హయాంలో మూతబడిన నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించే ప్రయత్నాలు ప్రారంభించి కాంగ్రెస్‌ ప్రభుత్వం. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ప్రధాన చక్కెర కర్మాగారంతో పాటు అనుబంధ సంస్థలు.. ప్రైవేట్‌ పరం కావడంతో కొన్నేళ్లుగా మూతపడ్డాయి. దీంతో చాలా మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కమిటీ వేసింది ప్రభుత్వం.

ఈ కమిటీలో మొత్తం పది మంది సభ్యులు ఉంటారు. కమిటీకి మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్‌గా, మరో మంత్రి దామోదర రాజ నర్సింహ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్సన్ రెడ్డి, రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రావుకు అవకాశం కల్పించారు. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు నిజాం షుగర్స్‌ లిమిటెడ్‌ ఎండీని సభ్యులుగా నియమించారు.

2002లో ప్రభుత్వ అధీనంలో
కాగా, 2002లో చక్కెర ఫ్యాక్టరీ పూర్తిగా ప్రభుత్వం అధీనంలో ఉండేది. అనంతరం 51 శాతం భాగస్వామ్యంతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. నిజాం దక్కన్ షుగర్స్‌గా మారిన తర్వాత 13 ఏళ్లు నిర్వహణ సమస్యలు ఎదుర్కొంది. క్రమంగా ఉత్పాదన తగ్గిపోవడంతో 2015లో మూతపడింది. అప్పటి నుంచి నిజాం షుగర్స్‌ తెరిపించాలని చాలా ఉద్యమాలు నడిచాయి. ఎన్నో పార్టీలు హామీలిచ్చినా.. కార్యరూపం మాత్రం దాల్చలేదు.

ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌రెడ్డి నిజాం షుగర్‌ ఫ్యాక్టరీపై వేసిన కమిటీతో సమావేశమయ్యారు. బోధన్‌, ముత్యంపేటలో మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీల పెండింగ్‌ బకాయిలు, ఆర్థిక ఇబ్బందులపై కమిటీ చర్చించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా షగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే సిఫార్సుల కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

అయితే.. మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించే క్రమంలో 51 శాతంగా ఉన్న భాగస్వామి ఒప్పుకుంటే సంయుక్తంగా నిర్వహించాలని.. లేకుంటే ప్రభుత్వమే పూర్తిగా నిర్వహణ బాధ్యతలు చేపట్టాలన్న ఆలోచనలో ఉంది.

Narsapuram : నర్సాపురం వైసీపీలో ఆసక్తికర రాజకీయం.. ఏం జరుగుతుందో తెలుసా?