Congress Highcommand Serious : భట్టి విక్రమార్క ఛాంబర్‌లో జేసి ఎపిసోడ్‌పై హైకమాండ్ సీరియస్

సీఎల్ పీ నేత భట్టి విక్రమార్క ఛాంబర్‌లో జేసీ ఎపిసోడ్‌పై హైకమాండ్ సీరియస్ అయింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ వివరణ కోరారు.

Congress Highcommand Serious : సీఎల్ పీ నేత భట్టి విక్రమార్క ఛాంబర్‌లో జేసీ ఎపిసోడ్‌పై హైకమాండ్ సీరియస్ అయింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ వివరణ కోరారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తుంటే… జేసిని ఎందుకు వారించలేదని ఠాగూర్ భట్టిని నిలదీశారు. దీంతో భట్టి విక్రమార్క హైకమాండ్‌కి వివరణ లేఖ పంపారు.

మొన్న సీఎల్ పీ కార్యాలయంలో జేసీ దివాకర్ రెడ్డి..కాంగ్రెస్ హైకమాండ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కామెంట్స్ చేశారు. అలాగే జానారెడ్డి..నాగార్జునసాగర్ లో గెలవరని ఇక తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని హాట్ కామెంట్స్ చేశారు. జేసీ కామెంట్స్ కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే వీహెచ్ లాంటి సీనియర్ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు.

దీంతో పార్టీ హైకమాండ్ కూడా ఈ విషయంపై సీరియస్ అయింది. ఈమేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఇవాళ భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి వివరణ ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి ఏపీ టీడీపీ నేతగా ఉన్న వ్యక్తి సీఎల్ పీ కార్యాలయానికి రావడం ఒకటైతే, కూర్చొని కాంగ్రెస్ నేతలపై కామెంట్స్ చేస్తుంటే ఆయన్ను ఎందుకు వారించలేకపోయారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఇలా కామెంట్ చేయడంతో మీడియాలో భారీగా ప్రచారానికి తెరలేవడంతో పార్టీకి డ్యామేజ్ అయిందని భావించడంతో ఠాగూర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తక్షణమే దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. దీనిపై భట్టి విక్రమార్క…హైకమాండ్ కు వివరణ ఇస్తూ లేఖ పంపినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు