తుక్కుగూడలో కాంగ్రెస్ జన జాతర సభ.. పాంచ్ న్యాయ్ పచ్చీస్ గ్యారంటీ పేరుతో హామీలివ్వనున్న కాంగ్రెస్

వేసవికాలం కావడంతో జన జాతర సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు పడకుండా కాంగ్రెస్ అధిష్టానం అన్ని ఏర్పాట్లు చేసింది.

Congress Public Meeting Tukkuguda

Tukkuguda Congress Public Meeting : లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇవాళ తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ జరగనుంది. జన జాతర పేరుతో టీపీసీసీ సభా ఏర్పాట్లు పూర్తి చేసింది. తుక్కుగూడ సభలో జాతీయ మేనిఫెస్టోను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు. ఈ సభకు 10 లక్షల మంది జన సమీకరణకు కాంగ్రెస్ ప్రణాళిక చేసింది. తెలంగాణ నలుమూలల నుంచి సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలిరానున్నారు. అయితే, ఈ సభలో మహిళల భాగస్వామ్యం అధికంగా ఉండేలా కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read : Venkatesh – Revanth Reddy : వెంకీమామతో రేవంత్ రెడ్డి.. CSK వర్సెస్ SRH మ్యాచ్‌లో సందడి.. ఫొటోలు, వీడియోలు వైరల్

జన జాతర సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 60 ఎకరాల్లో సభా ప్రాంగణం, 700 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ అవకాశం కల్పించారు. వేసవికాలం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా కాంగ్రెస్ అధిష్టానం అన్ని ఏర్పాట్లు చేసింది. 2023 సెప్టెంబర్ 17న అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి ఆరు గ్యారంటీలు సోనియాగాంధీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఏఐసీసీ పాంచ్ న్యాయ్ పచ్చిస్ గ్యారంటీ పేరుతో ఐదు రకాల ప్రధాన హామీలు కాంగ్రెస్ అగ్రనేతలు ఇవ్వనున్నారు. మేనిఫెస్టోలో తెలంగాణ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వంద రోజుల పాలన విజయాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రజలకు ఏఐసీసీ అగ్రనేతలు సభలో వివరించనున్నారు. తుక్కుగుడా సభతో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టనుంది.

Also Read : Kcr On Phone Tapping : ఫోన్ ట్యాపింగ్‌పై ఎట్టకేలకు స్పందించిన కేసీఆర్.. కీలక వ్యాఖ్యలు